KDP: జమ్మలమడుగు పెన్నా నది ఒడ్డున ఉన్న హజరత్ సయ్యద్ షా గూడుమస్తాన్ వలీ ఉరుసు ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉరుసులో విద్యుత్ దీపాలంకరణ ఎంతో ఆకర్షణగా ఉంది. ఈ ఉరుసు 4 రోజుల పాటు జమ్మలమడుగు ప్రజలను అలరిస్తుంది. ఈ ఉరుసులో హిందు, ముస్లిం సోదర సోదరీమణులు మతాలకు అతీతంగా పాల్గొని పూజలు చేస్తారు.