MBNR: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కోయిలకొండ మండలంలో రైతు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు ఉన్నాయా పరిశీలించి తెలుసుకున్నారు.