TG: సిద్దిపేటలోని అమరవీరుల స్థూపం నుంచి వరంగల్ సభ వరకు మాజీమంత్రి హరీష్ రావు పాదయాత్ర ప్రారంభించారు. వెయ్యి మంది విద్యార్థి, యువతతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పాదయాత్ర మొదలుపెట్టారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు.