కృష్ణా: వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఛైర్మన్ కొనకళ్ళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి సూపరిండెంట్ ముందుచూపుతో రోగులకు ఇలాంటి సేవలు శుభపరిణామమన్నారు.