ASR: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో భాగంగా సోమవారం పాడేరులో సంతకాల సేకరణ జరిగింది. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఇతర జిల్లా అధికారులు సంతకాలు చేశారు. అలాగే స్థానిక ఆశ్రమ పాఠశాల నుండి కలెక్టరేట్ జంక్షన్ వరకు ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.