ప్రకాశం: కనిగిరిలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఐ ఖాజావలిను డీఎస్పీ ఆదేశించారు. ఎటువంటి అనుమతులు లేకుండా బయటి వ్యక్తులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించవద్దని డీఎస్పీ సూచించారు. పరీక్షలు ముగిసే వరకు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు