ప్రకాశం: బడ్జెట్ సవరించి వెలిగొండకు అధిక నిధులు ఇవ్వాలని హనుమంతునిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ నాయకులు ధర్నా చేశారు. సీపీఎం సీనియర్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగానే కూటమి ప్రభుత్వం కూడా వెలుగొండకు చాలీచాలని నిధులు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. తక్షణం బడ్జెట్ సవరించి రూ. 2000 కోట్లు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.