శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికులను పూర్తిగా విస్మరించిందని ఏఐటీయూసీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం మున్సిపల్ కార్మికులతో కలసి ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ. 35,000 అందజేయాలని డిమాండ్ చేశారు. మార్చి 11న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.