AKP: జీడిపిక్కలకు మద్దతు ధర ఇవ్వాలంటూ మాడుగుల మండలం అవురవాడ పంచాయతీ కొండవీధి గ్రామంలో సోమవారం జీడి రైతులు నిరసన చేపట్టారు. గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ.. జీడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దళారీల చేతిలో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. జీడీపంటకు మద్దతు ధర కోసం అసెంబ్లీలో చర్చించి మద్దతు ధర ఇవ్వాలన్నారు.