ATP: రాష్ట్ర మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మిక సమస్యల పరిష్కారానికై సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగనున్న ధర్నా కార్యక్రమానికి గుంతకల్లు పారిశుద్ధ కార్మికులు అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. కార్మిక సంఘం అధ్యక్షులు చిన్న కొండయ్య మాట్లాడుతూ.. పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నాకు వెళ్తున్నామన్నారు.