NLR: అనుమానాస్పద కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ తెలిపారు. ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని, మీ అమౌంట్ రెట్టింపు చేస్తామని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్డు వివరాలతోపాటు సీవీవీ, ఓటీపీ సమాచారం చెప్పవద్దని అన్నారు. సైబర్ మోసానికి గురి అయితే 1930 నవంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.