ఉక్రెయిన్‌కు 2B డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఈ రుణం ద్వారా 5000 ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను కొనుగోలు చేయడానికి ఉక్రెయిన్‌కు అనుమతినిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ రుణ ఒప్పందంపై యూకే ఛాన్సలర్ రేచెల్ రీవ్స్, ఉక్రెయిన్ ఫైనాన్స్ మినిస్టర్ సెర్గీ మార్చెంకో సంతకాలు చేశారు. ఈ రుణాన్ని ఈ వారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది.