ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. బీజేపీని టార్గెట్ చేస్తూ దీదీ చేసిన ఆరోపణలను ఈసీ ఖండించింది. ఒకే ఈసీఐ నెంబర్‌తో రెండు ఓట్లు ఉండటం అసాధ్యమని స్పష్టం చేసింది. EPIC నెంబర్ల డూప్లికేషన్ జరిగినంత మాత్రాన నకిలీ ఓట్లు రికార్డు అయినట్లు కాదని వెల్లడించింది.