BDK: కొత్తగూడెం సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం పీవీకే-5 గనిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీ. భానుమతి న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, రక్షణ వివరాలు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. న్యాయ సహాయం అందుబాటులో ఉంటదని భరోసా ఇచ్చారు.