KRNL: మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో రిసర్వే ప్రాజెక్టుపై సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎన్నికైన సుంకేశ్వరి గ్రామంలోని గ్రామ సచివాలయంలో రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోన్న తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో కలిసి సమీక్షించారు. వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.