RR: జర్నలిస్టులందరూ ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని రంగారెడ్డి జిల్లా టి డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. సత్యనారాయణ ఎం. సైదులు పిలుపునిచ్చారు. మంగళవారం శంషాబాద్ పద్మావతి ఫంక్షన్ హాల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ విస్తృత స్థాయి సమావేశం నేషనల్ కమిటీ సభ్యులు బి. దేవేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించారు.