ఈ మధ్య సోషల్ మీడియాలో లుంగీ కట్టుకుని సహజనటి జయసుథ నిలబడ్డ ఓ ఫోటో తెగ వైరల్ అయింది. ఆమె సన్నిహితులు, మిత్రబృందం కూడా శక్తివంచన లేకుండా ఆ స్టిల్‌ని ఆమెకు ఆ ఫోటోని పంపించి, పంపించి ఊపిరాడనివ్వకుండా చేశారు. ఆ లుంగీ చాలా పాప్యులర్ బ్రాండ్‌గా డెబ్భై దశకాల నుంచి ఇటీవలి వరకూ కూడా కొనసాగుతూ వచ్చిన శంఖు మార్కు లుంగీ.
సూపర్ స్టార్స్ మార్కెట్లో కొత్త ప్రాడక్టులకి బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించడం అన్నది ఏనాటి నుంచో ఉన్నదే. సావిత్రి లక్స్ సబ్బులకి, బాంబే డయింగ్ చీరలకి సంవత్సరానికో స్టార్ హీరోయిన్‌తో యాడ్స్ అన్నవి మొదలై ఎన్నాళ్ళో అయింది. అంత మోడ్రనైజేషన్ లేని రోజుల్లోనే ఫిలిప్స్ రేడియో సంస్థ ఘంటసాలగారిచేత ప్రింట్ మీడియాలో యాడ్స్ ప్రచురించారు. తర్వాత రోజులలో ఇంక ఈ ట్రెండ్ వేలం వెర్రిగా మారిపోయింది. కార్పొరేట్ బిగ్ బుల్స్ అనుకున్నవాళ్ళు హోరాహోరీగా యాడ్స్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ, ప్రభాస్ నుంచి మహేష్ బాబు వరకూ కూడా ఎవ్వరూ ఈ ట్రెండ్ నుంచి తప్పించుకోలేకపోయారు. కొండొకచో వాళ్ళవాళ్ళ స్టార్‌డమ్‌ని క్యాష్ చేసుకోవడానికి కోటానుకోట్ల రూపాయల పారితోషకం ఇచ్చి మరీ వ్యాపారసంస్థలు తెగ రెచ్చిపోయారు. రెచ్చిపోతున్నారు. చివరికి గానగందర్వుడు ఎస్పీ బాలు, కళాతపస్వి అనిపించుకున్న దర్శకుడు కె. విశ్వనాథ్ సైతం సువర్ణభూమి అనే రియల్ ఎస్టేట్ సంస్థకి ఏళ్ళ తరబడి బ్రాండ్ అంబాసిడర్లుగా కనపించారు. తర్వాత అదే సంస్ధకి రామ్ చరణ్ కూడా వత్తాసు పలికారు.
ఇదంతా ఓ వ్యవహారం. ఈ మధ్య సోషల్ మీడియాలో లుంగీ కట్టుకుని సహజనటి జయసుథ నిలబడ్డ ఓ ఫోటో తెగ వైరల్ అయింది. ఆమె సన్నిహితులు, మిత్రబృందం కూడా శక్తివంచన లేకుండా ఆ స్టిల్‌ని ఆమెకు ఆ ఫోటోని పంపించి, పంపించి ఊపిరాడనివ్వకుండా చేశారు. ఆ లుంగీ చాలా పాప్యులర్ బ్రాండ్‌గా డెబ్భై దశకాల నుంచి ఇటీవలి వరకూ కూడా కొనసాగుతూ వచ్చిన శంఖు మార్కు లుంగీ. ఈ శంఖు మార్కు లుంగీలు చాలా ఖరీదైనవి. ప్రతీ ఊర్లో ప్రతీ బట్టల షాపులో అమ్మకానికి సిద్ధంగా ఉండేవి. పబ్లిక్ కూడా వేలంవెర్రిగా కొనుక్కునేవారు. శంఖుమార్కు లుంగీ అంటే స్టేటస్ సింబల్ అనమాట.
అయితే మగాళ్ళు మాత్రమే కట్టుకునే ఈ శంఖు మార్కు లుంగీకి ఒక ఫిమలే యాక్ట్రస్ యాడ్స్ చేయడమేంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీని మీదే సోషల్ మీడియాలో కామెంట్లు పెనుతుఫానును లేపాయి. పైగా ఆ లుంగీలు మార్కెట్లో పెద్దగా కూడా కనబడడం లేదు. ఈ టైంలో ఆ ఫోటో బైటకు రాగానే దీని మీద అందరి దృష్టి పడింది. పైగా లుంగీ కట్టుకున్నది ఎవరో కాదు, తెలుగువాళ్ళంతా ఎంతగానో అభిమానించే జయసుధ. ఫేన్స్ నుంచి తట్టుకోలేనంత తాకిడి ఎదురైన తర్వాత జయసుథ హిట్ టీవి డాట్ కామ్ దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. అసలిది శంఖు కాదు, శంగు అని అసలు పేరుట. ఈ లుంగీని కేరళలో ముస్లిం యువతులు మాత్రమే ధరిస్తారుట. అని జయసుథ చెప్పుకొచ్చారు. నిజమే. మళయాళం సినిమాల్లో గ్రామీణ ప్రాంతాల కథలతో తీసిన సినిమాలలో కొందరు హీరోయిన్లు అంటే షీలా, జయభారతి లాంటివారు కూడా ఈ గళ్ళ లుంగీలతో కనిపిస్తారు. ఆ లుంగీలను తెలుగునాట ప్రవేశపెట్టినప్పుడు, ఈ సంస్థ ప్రొప్రయిటర్ ఓ ముస్లిం జయసుధ ఫాదర్‌కి మంచి ఫ్రెండుట. అందుకని ఆ ఆబ్లిగేషన్ మీద జయసుథ ఈ యాడ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇదీ ఆ లుంగీ కథ.