మెగా అనిల్ కాంబినేషన్ గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీద మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అదేంటంటే...ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాడనే వార్త మొదటనుంచి వైరల్ అవుతూనే ఉంది.
అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దుమ్ములేపేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరుపదుల వయసులో ఏ హీరోకి ఇంత పెద్ద హిట్ వచ్చిన దాఖలాలే లేవు. ఒక్క సీనియర్ ఎన్టీఆర్ కి తప్ప. నిర్మాతగా అగ్రనిర్మాత దిల్‌రాజు గేమ్ ఛేంజర్‌తో గట్టి దెబ్బే తిన్నా కూడా, వెంటనే జస్ట్ రోజుల తేడాలో రిలిజైన సంక్రాంతికి వస్తున్నాం దిల్‌రాజు కీర్తిప్రతిష్టలని మళ్ళీ ఆయనకి అందించింది.
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఏ సినిమాని టేకప్ చేస్తాడా అనే చర్చ జరుగుతున్నప్పుడే మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టాడు అనిల్. ఎప్పటి నుంచో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఉవ్విళ్ళూరుతున్న అనిల్‌కి ఆ అవకాశం తన్నుకొచ్చింది. వెంటనే కథకూడా పూర్తయిపోయింది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌తో తెరకెక్కుతున్నట్టుగా చెబుతున్న ఈ మెగా అనిల్ కాంబినేషన్ చిత్రం మీద విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలోనే నయనతార హీరోయిన్ అనే న్యూస్ రావడం, మెగాస్టారే స్వయంగా ఆ విషయాన్ని తన ఎక్స్ హేండిల్ ద్వారా రూఢీ చేయడంతో ఈ మథ్యరోజుల్లో మెగస్టార్ చిత్రాల్లో ఈ ప్రాజెక్టు గొప్ప ఎక్సైట్మెంట్ని సొంతం చేసుకుందన్న మాట వాస్తవం.
ఎన్నో వివరాలు ఈ మెగా అనిల్ కాంబినేషన్ గురించి వెలువడాల్సిన పరిస్థితే ఉన్నా, ప్రధానంగా హీరోయిన్ ఎవరూ అన్న మీమాంస వీడిపోయింది కాబట్టి, అభిమానులు ఊపిరి పీల్చుకుని, సోషల్ మీడియాలో వీరలెవెల్లో సందడి చేస్తున్నారు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం మీద మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అదేంటంటే…ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాడనే వార్త మొదటనుంచి వైరల్ అవుతూనే ఉంది. కాకపోతే దీనికి సంబంధించిన అధికారికమైన వార్త మాత్రం ఇప్పటివరకూ వెలువడలేదు.
కానీ అనిల్ సన్నిహితవర్గాలు మాత్రం ఔననీ అనడం లేదు. కాదనీ అనడం లేదు. ఇది దేనికి సంకేతం? ముఖ్యంగా దీనికి కారణం మెగాస్టార్‌కి, వెంకీకి మధ్యలో అద్భుతమైన స్నేహబంధం ఉంది ఇంత ఎంటర్టైన్మెంట్ నిండిన ఈ కథలో ఒక పాత్ర మాత్రం వెంకటేష్‌ని డిమాండ్ చేస్తోందని, అనిల్ రావిపూడి నిజంగానే గనక కోరుకుంటే చెయ్యడానికి వెంకటేష్ గ్యారెంటీగా ముందుకు వస్తాడని అనిల్ టీం అంటున్నట్టు భోగట్టా. పైగా వెంకటేష్ గతంలో కూడా మహేష్‌బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో చేయడం, వరుణ్ తేజ్ లాంటి యంగ్ బడ్డింగ్ హీరోతో కూడా జతకట్టడంతో ఈ వార్తకి బలం చేకూరింది. అయితే ప్రస్తుతం వెంకటేష్ అమెరికా టూర్లో ఉన్నారు. ఆయన వచ్చాక పూర్తిగా కథ ఏమిటి, అందులో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే విషయాలను గ్రహించాక వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.