పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహరవీరమల్లు పూర్తిగా వార్తల్లో ఎక్కడా లేకపోవడంతో మెగాఅభిమానులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఒక్కసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ కాగానే సముద్ర కెరటాల్లా అభిమానులు ఆకాశమంత ఎత్తుకు ఎగిరి, కేరింతలు కొడుతున్నారు. దీని వెనుక కాంబినేషన్ సెన్సేషన్ కూడా దాగి ఉండడం కూడా ప్రధానమైన కారణంగా భావించాలి.
మబ్బుల చాటున దాగున్న సూర్యుడిలా, ఇన్నాళ్ళూ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహరవీరమల్లు పూర్తిగా వార్తల్లో ఎక్కడా లేకపోవడంతో మెగాఅభిమానులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఒక్కసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ కాగానే సముద్ర కెరటాల్లా అభిమానులు ఆకాశమంత ఎత్తుకు ఎగిరి, కేరింతలు కొడుతున్నారు. దీని వెనుక కాంబినేషన్ సెన్సేషన్ కూడా దాగి ఉండడం కూడా ప్రధానమైన కారణంగా భావించాలి. ఖుషీ లాంటి సంచలనాత్మక విజయాన్ని అందించిన కాంబినేషన్ ఎఎం రత్నం, పవన్ కళ్యాణ్ మళ్ళీ కలిసారని, పైగా ఆ చిత్రం గొప్ప చారిత్రక నేపథ్యంలో, పీరియడ్ ఫిల్మ్‌గా తయారు కావడం, భారీ సెట్లతో పవర్‌స్టార్ కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో హరిహరవీరమల్లు అభిమానుల గుండెల్లోనే కాదు, మొత్తం సినిమా ట్రేడ్‌లోనే పూర్తిస్థాయి సంచలనాన్ని సృష్టిస్తోందీ చిత్రం.
సెట్లు కూడా మినియేచర్ వర్క్ కాదు, చార్మినార్ సెట్ కూడా ఏదో వేశారులే అంటే వేశారన్నట్టుగా కాకుండా ఒరిజినల్‌గా చార్మినార్ ఎంత ఎత్తులో, ఎంత విత్లో కట్టారో, అంతే సైజులో చార్మినార్ సెట్‌ని వేయడం, దేశంలో వివిధమైన అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశాలలో షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఓ కాస్ట్లీ ప్రాజెక్టుగా హరిహరకి ఎనలేని క్రేజ్‌ని తీసుకువచ్చింది. దీనికి తోడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల కేంపైన్ సంరంభం ప్రారంభం కాకముందే చిత్రీకరణ కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ కూడా పవన్ ఎలక్షన్ షెడ్యూల్‌కు అనుగుణంగా షూటింగ్ ఆగిఆగి జరుగుతూ, మధ్యలో పూర్తిగా ఆగిపోయాయి.
పవర్‌స్టార్ డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఆయన డేట్స్ ఇచ్చేవరకూ నిర్మాత రత్నం నిరీక్షించాల్సి వచ్చింది. అప్పుడే హరిహర అనేక విమర్శలకు కూడా లోనయ్యింది. ఇదసలు పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లుకొట్టాయి. అయితే రత్నం మాత్రం గుండె నిబ్బరంతో ముందుకు వెళ్ళారు. పవర్ స్టార్ డేట్స్ కుదిరాక నిలకడ షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించి సినిమాని ఫినిష్ చేశారు. మొన్నీ మధ్యనే రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాతగానీ సినిమా రిలీజ్‌ని ఎవ్వరూ నమ్మలేదు. ఆరోగ్యపరంగా డిప్యూటీ సిఎం హోదాలొ అనేక బాధ్యతల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, మాటిచ్చిన ప్రకారం పవన్ కళ్యాణ్ తన వర్క్ పూర్తిచేశారు. జూన్ పన్నెండున విడుదలకు సర్వసన్నాహాలు చేస్తున్న నిర్మాత రత్నం పెద్ద బరువునే మోస్తున్నారు. కాకపోతే ఆయన ధైర్యం మాత్రం పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ అండ్ గ్లామర్. అత్యంత భారీ వ్యయంతో నిర్మించి, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ విజయాన్ని సాధించాలనే రత్నం పట్టుదల విజయఫలాలను అందిస్తుందనే ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.