పవన్ కళ్యాణ్ సినిమా గురించి పవన్ అభిమానులు ముఖం వాచిపోయున్నారు. ఇటువంటి పరిస్థితులలో కీరవాణి అందించిన బాణీలు డోకొస్తున్నాయని పోష్టులు పెడుతున్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించి శ్రీరామ పాట విని అందరూ తలలు పట్టుకున్నారు.
కీరవాణి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది అన్నమయ్య, రామదాసు, పాండురంగడు ఇలా, తర్వాత బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి చిత్రాలు ఇలా. పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలు, పెద్ద బ్యానర్లు అలా కీరవాణి హవా నడుస్తోంది తెలుగు చిత్రపరిశ్రమలో. క్రిమినల్ చిత్రంతో బాలీవుడ్లో కూడా ఎంఎం క్రీమ్ అని, తమిళంలో మరకదమణి అని కీరవాణి పేరు మారుమోగుతూ వచ్చింది. ఇంక సరేసరి, నాటునాటు పాట సాహిత్యానికి గానూ ఆస్కార్ అవార్డు రాగానే కీరవాణికి తిరుగులేని పేరొచ్చి పడింది. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. కానీ ఇటీవల మెగాబ్రదర్స్ …మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర చిత్రానికి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి హరిహరవీరమల్లు చిత్రానికి ఏకకాలంలో కీరవాణి సంగీతమే దిక్కైంది.
కానీ మెగా అభిమానులు కీరవాణి ఇచ్చిన బాణీలతో తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. అసలు ఆ పాటలేందయ్యా బాబూ అని ఘొల్లుమన్నారు. అసలే మెగాస్టార్ గత కొన్ని చిత్రాలుగా అభిమానులు వరస వైఫల్యాలను తట్టుకోలేక నిరాశలో కొట్టుమిట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి ఎన్నాళ్ళో అయింది. ఆయన సినిమా గురించి పవన్ అభిమానులు ముఖం వాచిపోయున్నారు. ఇటువంటి పరిస్థితులలో కీరవాణి అందించిన బాణీలు డోకొస్తున్నాయని పోష్టులు పెడుతున్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించి శ్రీరామ పాట విని అందరూ తలలు పట్టుకున్నారు. మూలిగేనక్క మీద తాటి పండు పడిందన్నట్టు అసలే విశ్వంభర గ్రాఫిక్ క్వాలిటీ సుతరామూ బాగులేదని ఫేన్స్ ముఖాలు వేలేయడమే కాదు, అందరూ పెట్టే రివర్స్ కామెంట్స్ చూసి తలెత్తుకోలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో కీరవాణి చేసిన శ్రీరామ పాట ట్యూన్ విని మెగాఫాన్స్కే కాదు, జనరల్ పబ్లిక్‌కి కూడా తిక్క లేచింది. ఏందిరా బాబూ ఈ ట్యూన్స్ అని చెడామడా తిట్టిపోస్తున్నారు కీరవాణిని. హరిహరవీరమల్లులో రెండు పాటలు ఇంతకు ముందు రిలీజ్ అయ్యాయి. వాటికే రకమైన మంచి స్పందనా రాకపోగా, యాంటీ రెస్పాన్ని మూటగట్టుకున్నాయి. రేపు మరో సాంగ్ రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ కూడా ప్రకటించిన తర్వాత విడుదలవుతున్న ఈ పాట ఎలా ఉంటుందోననే దారుణమైన ఆక్రోశంలో పవర్‌స్టార్ ఫేన్స్ కూరుకుపోయున్నారు.
నిజానికి కీరవాణి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాలకి, రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాలకి తప్పితే మరే చిత్రాలకి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడన్న రికార్డు ఏం లేదు. వాళ్ళ సినిమాలకి కూడా వాళ్ళ టేకింగ్, సిట్యువేషన్ క్రియేషన్ వల్ల ఆ బాణీలు రాణించాయి గానీ, ఇండివిడ్యువల్‌గా చూస్తే అవి కూడా ఏమంత గొప్పవి కావనే విమర్శలు, ఆరోపణలు కీరవాణి మీద కోకొల్లలు. గతంలొ ఆపద్బాంధవుడు సినిమాకి కీరవాణి సంగీతమిచ్చాడు. ఘరానా మొగుడు చిత్రానికి కూడా కీరవాణే. కానీ దీనికి రాఘవేంద్రరావే దర్శకత్వం అన్నది గమనార్హం.పవన్ కళ్యాణ్ చిత్రానికైతే ఇదే మొదటిసారి సంగీతం చేయడం.