ATP: శింగనమల వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి శైలజానాథ్ పుట్లూరు మండలంలో మంగళవారం పర్యటించారు. మండల కేంద్రంలో వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.