KRNL: ఎమ్మిగనూరులో మంగళవారం మినీ మహానాడు నిర్వహించారు. MLA జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో KUDA ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా TDP అధ్యక్షుడు తిక్కారెడ్డి, MP నాగరాజు పాల్గొన్నారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించారు. పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో కడపలో జరిగే మహానాడుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.