ASR: రాజవొమ్మంగి మండలం శరభవరంలో దాట్ల చరిత అనే గిరిజనేతర మహిళ చేపడుతున్న శాశ్వత ఇంటి నిర్మాణ పనులను నిలిపివేయాలని పెసా కమిటీ ఉపాధ్యక్షులు పప్పుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు ఇంటి నిర్మాణం చేపట్టడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.