ASR: మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించిన కూనవరం మండలంలోని ఐదు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కూనవరం ఎలీ యూనిట్-1 నసరయ్య తెలిపారు. వాల్ఫర్ పేట, కూడేల్లిపాడు, టేకుబాక, కూనవరం, టేకులబోరు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహిస్తామన్నారు.