ASR: అనంతగిరి మండలంలోని బొర్రాలో శుక్రవారం ఆరోగ్య రథం ద్వారా డాక్టర్ చైతన్య రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. వైద్యులు మాట్లాడుతూ.. ఆరోగ్య రథం ద్వారా నిర్వహిస్తున్న వైద్య సేవలను గ్రామాల్లో ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, వ్యక్తి గత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని సూచించారు.