ELR: ఉంగుటూరు మండలం కాగుపాడులో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులను, స్థానిక వైధ్యశాలలో వైధ్యులను, సిబ్బందిని పట్టభద్రులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.