VZM: తెర్లాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్.ఉమాలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ రాంబాబు, ఎమ్మార్వో హేమంత్ కుమార్, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, సర్పంచులు పాల్గొన్నారు.