PPM: గిరిజన విద్యా సంస్థల్లో అన్ని బాగుంటే గిరిజన విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతున్నాయో గిరిజన శాఖ అధికారులు ప్రభుత్వం సమాధానం చెప్పాలని గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాల సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. 45 మంది గిరిజన విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని అన్నారు.