ASR: రానున్న పదవ తరగతి రెగ్యులర్, ఇంటర్ రెగ్యులర్, సార్వత్రిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, 144 సెక్షన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.