VZM: తెర్లాం మండలం పెరుమాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత నేత్ర శిబిరం నిర్వహించారు. ఈ నేత్ర శిబిరాంలో 45 మందికి తనిఖీలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ఞ రమని, ఆప్తమాలిక అధికారి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.