TPT: తడ రైల్వే స్టేషన్ సమీపంలో డ్యూటీలో ఉన్న రైల్వే ఉద్యోగిని రైలు ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం గ్యాంగ్ మ్యాన్‌గా పనిచేస్తున్న ఇద్దరిని చెన్నె వెళ్తున్న రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు క్షతగాత్రుడిని సూళ్లూరుపేట వైద్యశాలకు తరలించారు.