»India Reports 2151 Covid 19 Cases In Last 24 Hours
Indiaలో ఒకరోజులో 2వేల పైచిలుకు చేరిన కరోనా కేసులు
India reports 2,151 Covid-19 cases:దేశంలో కరోనా కేసులు (corona cases) పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2 వేల మార్క్ దాటాయి. 152 రోజుల (152 days) తర్వాత కేసుల సంఖ్య పెరిగింది. గతేడాది అక్టోబర్ 28వ తేదీన 2208 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
India reports 2,151 Covid-19 cases in last 24 hours
India reports 2,151 Covid-19 cases:దేశంలో కరోనా కేసులు (corona cases) పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2 వేల మార్క్ దాటాయి. 152 రోజుల (152 days) తర్వాత కేసుల సంఖ్య పెరిగింది. గతేడాది అక్టోబర్ 28వ తేదీన 2208 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 2151 కేసులు వచ్చాయి. దీంతో దేశంలో కరోనా (corona) యాక్టివ్ కేసుల సంఖ్య 11,903కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతానికి చేరింది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 శాతానికి చేరింది. కరోనా వైరస్ (corona virus) సోకి ఏడుగురు చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 5,30,848కి చేరింది. మహారాష్ట్ర (maharashtra), కేరళలో (kerala) ముగ్గురు చొప్పున, కర్ణాటకలో (karnataka) ఒకరు చనిపోయారు.
దేశంలో కరోనా సోకిన మొత్తం సంఖ్య 4.47 కోట్లకు చేరింది. దీనిలో యాక్టివ్ కేసులు కేవలం 0.03 శాతం మాత్రమే ఉన్నాయి. కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య 98.78 శాతంగా ఉంది. మృతుల సంఖ్య 1.19 శాతంగా ఉంది. ఇప్పటికే 220.65 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ అందజేశామని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
దేశంలో వస్తోన్న కరోనా వేరియంట్‌ను (corona varient) ఎక్స్‌బీబీ 1.16గా గుర్తించారు. ఈ వైరస్ కూడా వేగంగా వ్యాపిస్తోందని వైద్యులు (doctors) చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ (second wave) అల్లాడించింది. దాదాపు ఇంటింటికీ వైరస్ (virus) సోకింది. సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకున్న వారు మాత్రమే బతికి బట్టకట్టారు. నిర్లక్ష్యం చేసిన వారు మాత్రం ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారిలో యువతే (youth) ఎక్కువ ఉండటం ఆందోళన కలిగించింది. ఆ తర్వాత థర్డ్, ఫోర్త్ వేవ్ వచ్చినా.. అంతలా ప్రభావం చూపలేదు.
ఇప్పుడు కొత్త వేరియంట్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దీంతోపాటు ఇన్ ఫ్లూయెంజా వైరస్ కూడా కాస్త భయపెట్టింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కేసులు మాత్రం నమోదు కాలేదు. దీంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ కరోనా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.