Mexico migrant facility:మెక్సికోలో (Mexico) ఘోర ప్రమాదం జరిగింది. సియుడాడ్ జుయారెజ్‌లో గల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వలసదారుల కేంద్రంలో (migrant facility) ఫైర్ యాక్సిడెంట్ (fire accident) అయ్యింది. ప్రమాదంలో 40 మంది (40 dead) చనిపోయారు. వీరంతా దక్షిణ అమెరికా, మధ్య అమెరికాకు చెందినవారని తెలిసింది.
Mexico migrant facility:మెక్సికోలో (Mexico) ఘోర ప్రమాదం జరిగింది. సియుడాడ్ జుయారెజ్‌లో గల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వలసదారుల కేంద్రంలో (migrant facility) ఫైర్ యాక్సిడెంట్ (fire accident) అయ్యింది. ప్రమాదంలో 40 మంది (40 dead) చనిపోయారు. వీరంతా దక్షిణ అమెరికా, మధ్య అమెరికాకు చెందినవారని తెలిసింది.
ప్రమాదం జరిగిన సమయంలో అందులో 68 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో 40 మంది చనిపోగా.. మిగతా 28 మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వలస కేంద్రంలో (migrant facility) ఉన్న కొందరు నిప్పు అంటించారని ఏపీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీలో గార్డులు పరుగుతీయడం కనిపిస్తోంది. అప్పటికే పొగ నిండటంతో కాపాడేందుకు వీలు కాలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రోల్ అవుతుంది. అదీ నిజమైనదేనని మెక్సికో అంతర్గత సెక్రటరీ అదన్ ఆగస్టో లోపెజ్ పేర్కొన్నారు.
తమను దేశం నుంచి బహిష్కరిస్తారనే భయంతో వలస కేంద్రంలో ఉన్న వారు నిప్పు అంటించుకున్నారని మెక్సికో (mexico) అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడర్ ఒక ప్రకటనలో తెలిపారు. వారిని చిన్న సెల్‌లోకి తీసుకెళ్లడం.. అక్కడ మంచి నీరు కూడా దొరకకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారని ఫెడరల్ అధికారి ఒకరు తెలిపారు.
ఫైర్ సిబ్బంది వచ్చేవారకు బయటకు రానీయలేదని.. లేదంటే ఈ స్థాయిలో మృతుల సంఖ్య ఉండరని వలస కేంద్రంలో ఉన్న వారి గురించి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న వారు గ్వాటెమాల, హెండురాస్, ఎల్ సాల్వడార్, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్‌కు చెందినవారు అని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. 40 మంది మృతుల్లో 28 మంది గ్వాటెమాలకు చెందినవారేనని విదేశాంగ మంత్రి మారియో బుకారో పేర్కొన్నారు.
ప్రతీ వలసదారుడిని సురక్షితంగా ఉంచే బాధ్యత ప్రభుత్వానిదేనని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. తామేమి నేరస్తులం కాదని చెబుతున్నారు. మెక్సికోలో వలసలు పెరుగుతున్నందున నిర్బంద కేంద్రాల్లో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కోరారని ప్రతినిధి స్టీఫెన్ ప్రకటనలో తెలిపారు.