కృష్ణా: గుడివాడ మండలం వలివర్తిపాడు బైపాస్ రోడ్డులో స్కంద అపార్ట్మెంట్ వద్ద ట్రాఫిక్ భద్రత అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై చంటిబాబు మాట్లాడుతూ.. రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, మద్యం సేవించకుండా,హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.