MDK: వెయ్యి గొంతులు, లక్ష డప్పుల మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని MRPS జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చేంద్ర పిలుపునిచ్చారు. జిన్నారం మండల కేంద్రంలో ఆ సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. MRPS జాతీయ అధ్యక్షులు మందకృష్ణ ఆధ్వర్యంలో జరిగే వేయి గొంతులు, లక్ష డప్పుల ప్రదర్శన విజయవంతం చేయాలని కోరారు. వీరయ్య, దేవులపల్లి, మహేష్, పాల్గొన్నారు.