Group1 Mains Exam: ఏపీలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాయిదా..కారణమిదే!
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్(Group1 Mains) పరీక్షలను(exans) వాయిదా(Postponement) వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు జరపనున్నట్లు వెల్లడించారు. అయితే UPSC సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు పోస్ట్ పోన్ చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్(Group1 Mains) పరీక్షలను అధికారులు వాయిదా(Postponement) వేశారు. జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేశారు. 2022 సివిల్స్ ఫేజ్ -3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు నిర్వహిస్తామని ఇటివల UPSC ప్రకటించింది.
ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేసినట్లు APPSC అధికారులు వెల్లడించారు. UPSC సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీలో గ్రూప్ 1 పరీక్ష రాస్తున్న వారిలో 25 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ క్రమంలో వారు ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఇస్తూ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ UPSC ఇంటర్వ్యూలలో ఏపీకి చెందిన అభ్యర్థులు ఎంపికైతే వారి భవిష్యత్ పూర్తిగా మారబోతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.