ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో… ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన వ్యవహారంపైనే చర్చంతా నడుస్తోంది. ఈ విషయంలోనే ఓ వైపీ టీఆర్ఎస్(trs), మరో వైపు బీజేపీ విమర్శలు చేసుకుంటున్నారు. అయితే… ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరూ ఈ విషయంపై మాట్లాడొద్దు అంటూ మంత్రి కేటీఆర్(ktr) తమ పార్టీ నేతలకు సూచించారు. కాగా.. కేటీఆర్ చేసిన ట్వీట్ పై తాజాగా విజయశాంతి స్పందించింది.
కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉందన్నారు. కత్తి బీజేపీది కాదు.. నెత్తి బీజేపీది కాదు.. దొరికిన అందరూ టీఆర్ఎస్ వాళ్ళే.. నడిపించిన మొత్తం కథ కూడా వాళ్లదే అని విమర్శించారు విజయశాంతి(vijayashanti). అయ్య ఆణిముత్యం చేసిన ప్రయోగాన్ని సమర్ధించుకోలేక.. స్వయంగా కుమారుల వారే టీఆర్ఎస్ నుండి ఎవరు మాట్లాడొద్దని పోస్ట్ చేశారన్నారు. మాట్లాడిన కొద్ది వారి మోసం ఎక్కువ బయట పడుతుందనే కేటీఆర్(ktr) భయమని తెలిపారు.
దొరికిన డబ్బు ఆధారాలు చూపట్లేదన్న ఆమె.. బీజేపీ పేరు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈ తల తక్కువ కేసులో ఏం లేదని.. అందుకే, న్యాయం కోసం బీజేపీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ అడ్డగోలుగా చేసిన ఈ ప్రయత్నంలో దొరికిపోయినట్టుగా తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు విజయశాంతి.