VZM: రాష్ట్ర పండుగ శ్రీశంబర పోలమాంబ అమ్మవారి సిరిమాను సంబరాలకు సంబంధించి సోమవారం శంబరలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.వి సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షతన కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎస్పీ ఎస్.వి మాధవ రెడ్డి సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుందని అన్నారు.