స్టార్ బ్యూటీ సమంత(samantha) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘యశోద'(Yashoda) రిలీజ్‌కు రెడీ అవుతోంది. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ‘యశోద’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. సరోగసీ కాన్సెప్ట్‌తో కూడిన రాజకీయంతో.. ఓ ఒంటరి మహిళ చేసిన పోరాటంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. లవ్, ఎమోషన్, యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ కట్ చేశారు.
‘నీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా.. బిడ్డని కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’ అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి సరోగసీ విధానం.. ఆ క్రమంలో గర్భవతిగా ఉన్న సమంత.. అనుకొని పరిణామాలను ఎలా ఎదర్కొందనేది.. ఇంట్రెస్టింగ్గా చూపించారు. మొత్తంగా అద్దే గర్భంతో ఉన్న యువతులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేజ్ చేశారు.. అసలు వాళ్లను ట్రాప్ చేసిందేవరు.. ఎందుకోసం చేశారు.. విషయం తెలుసుకున్న తర్వాత సమంత ఏ చేసింది.. తనను తాను కాపాడుకోవడంతో పాటు.. తోటి యువతుల్ని కాపాడిందా.. అనేది ఆసక్తికరంగా సాగింది.
ముఖ్యంగా సమంత(samantha) యాక్షన్ స్టంట్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ట్రైలర్లో వరలక్ష్మీ శరత్ కుమార్ డాక్టర్‌గా లీడ్ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో ‘యశోద ఎవరో తెలుసు కదా..! ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి’ అనే డైలాగ్ వినిపించింది. మొత్తంగా ‘యశోద’ పోరాటం ఎలా సాగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ‘యశోద’ ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ థాంక్స్ చెప్పారు.