ఏపీ(AP) వ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ(YCP) ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి(Tirupathi)లో 7 కొత్త 104 వాహనాలను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మహోన్నత లక్ష్యంతో, పేదవారికి కూడా ఆధునిక వైద్యం ఉచితంగా అందించాలని దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్(YSR) 104, 108 సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. గతంలోనే జిల్లాలో 32 వాహనాలు ప్రారంభించారని, తాజాగా మరో 7 వాహనాలను(Vehicles) ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, జేసి బాలాజీ పాల్గొన్నారు.

కలెక్టర్ వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వైద్యం అందుబాటులో ఉండేలా ప్రతి 2 వేల మందికి ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్(YSR Village Clinic) లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల వద్దకే వైద్యం అందించే ఉద్దేశంతో జిల్లాలో 436 విలేజ్ హెల్త్ క్లినిక్(Health Clinic)లు ఏర్పాటయ్యాయయన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో నెలకు రెండు సార్లు 104 వాహనాలు పర్యటించి వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా 104 వాహనాల(104 Vehicles) సాయంతో అసంక్రమిత, సంక్రమిత వ్యాధులకు మెడిసిన్స్, 14 రకాల డయాగ్నోస్టిక్ ర్యాపిడ్ కిట్స్, 67 రకాల మందుల(medicines)ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి పౌరుడికి పరీక్షలు చేసి వారి ఆరోగ్య సమాచారాన్ని(Health Information) డిజిటలైజ్ చేసి యాప్ లో నమోదు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, శేషశయనా రెడ్డి, డాక్టర్ ఛత్రప్రకాష్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, పీహెచ్సీ వైద్యులు పాల్గొన్నారు.