KMM: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, పదవీ విరమణ చేసిన అధికారులను సీపీ సునీల్ దత్ శాలువాలతో సత్కరించి, మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల కాలం పాటు శాఖకు వారు అందించిన నిస్వార్థ సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో పోలీసులకు వెన్నంటి ఉండి ప్రోత్సహించిన వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.