Pulivendula చెక్ పోస్ట్ కూడా తాకలేరు.. చంద్రబాబుపై రోజా విసుర్లు
RK Roja:ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (mlc election results) ఏపీ పాలిటిక్స్‌లో మరింత హీట్ పుట్టించాయి. సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ సీటు (tdp seat) గెలవడంతో ఆ పార్టీ నేతలు వైసీపీపై (ycp) ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత, మంత్రి రోజా (roja) రియాక్ట్ అయ్యారు.

సింహం (lion) ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదని మంత్రి రోజా (Roja) అన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలిచినందుకే చంద్రబాబు (chandrababu) హంగామా చేస్తున్నారని విమర్శించారు. వైనాట్ పులివెందుల అంటున్నారని.. పులివెందుల చెక్ పోస్టును (checkpost) కూడా తాకలేరని చెప్పారు. ప్రజల మనసుల్లో సీఎం జగన్ (jagan) ఉన్నారని… 175 సీట్లకు 175 గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఒక ఎమ్మెల్సీ (mlc seat) సీటు గెలిచారని మంత్రి రోజా (Roja) విమర్శించారు. చంద్రబాబువి (chandrababu) దిగజారుడు రాజకీయాలని ఆమె దుయ్యబట్టారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (anuradha) విజయం సాధించారు. అనురాధకు ఆనం రాంనారాయణ రెడ్డి (anam ram narayana reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy), ఉండవల్లి శ్రీదేవి (sirdevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (chandra shekar reddy) ఓటు వేశారట.. వారిని సస్పెండ్ చేశామని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ప్రకటించారు.