ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బసవరాజు లహరిధర్ సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘డ్రింకర్ సాయి సినిమా సన్నాహాల్లో ఉన్నప్పుడు చిరంజీవికి కథ చెప్పాం. ఆయన విని ఓకే ప్రొసీడ్ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం’ అని తెలిపారు.