హనుమకొండ: జిల్లాలోని ఆర్టీసీ కార్యాలయంలో కుర్చీల కొరతతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. బస్ పాస్ కౌంటర్ల దగ్గర సిబ్బందికి కూర్చునేందుకు సరైన కుర్చీలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇనుప రాడ్తో స్టూల్కు ప్లాస్టిక్ కుర్చీ జత చేయడంతో సిబ్బంది అసౌకర్యంగా కూర్చుంటున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని సిబ్బంది కోరారు.