BHPL: జిల్లా కేంద్రంలోని అడిషనల్ ఎస్పీ అంగోత్ నరేశ్ కుమార్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే అతి ఉత్కృష్ట సేవా పతకానికి బుధవారం ఎంపికయ్యారు. 34 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తూ, సమర్థవంతమైన దర్యాప్తుతో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడేలా కృషి చేశారు. గతంలో నరేశ్ కుమార్ సేవా పథకం, కఠిన సేవా పథకం, ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్‌ను అందుకున్నారు.