TG: తాను సినిమా చూస్తున్నప్పుడు బయట థియేటర్ వద్ద పరిస్థితిని తనకు పోలీసులు ఏం చెప్పలేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఘటన జరిగినప్పుడు ఆస్పత్రికి వెళ్లాలని అనుకున్నా.. కానీ, పోలీసులు తనను రావొద్దని సూచించారన్నారు. తన సినిమా హిట్ అయినా.. 15 రోజులుగా బాధాపడుతూనే ఉన్నానని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.