»Man Arrested For Throwing Acid On Wife On Court Campus
Acid attack: ప్రియుడితో వెళ్ళిపోయిందని, కోర్టులోనే భర్త యాసిడ్ దాడి
తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే ఆమె పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. భర్త శివకుమార్... ప్రియుడితో వెళ్లిన తన భార్య కవిత పైన గురువారం యాసిడ్ పోశాడు. ఈ దాడిలో ఆమెతో పాటు ఆమెకు సమీపంలో ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే ఆమె పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. భర్త శివకుమార్… ప్రియుడితో వెళ్లిన తన భార్య కవిత పైన గురువారం యాసిడ్ పోశాడు. ఈ దాడిలో ఆమెతో పాటు ఆమెకు సమీపంలో ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలు కవిత 2016లో ఓ చోరీ కేసులో నిందితురాలు. ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నది. ఈ కేసు విచారణ కోసం గురువారం ఆమె కోయంబత్తూరు కోర్టుకు వస్తుందని భర్తకు తెలుసు. దీంతో నీళ్ల బాటిల్ లో యాసిడ్ పోసి అక్కడకు వచ్చాడు. ఆమె కనిపించగానే ముఖం పైన యాసిడ్ పోశాడు. ఈ దాడిలో ఆమె మెడ కింద తీవ్రంగా కాలిపోయింది. ఆమెకు 80 శాతం గాయాలయ్యాయి. శివ కుమార్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. శివ, కవితలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడి వారం క్రితం అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త యాసిడ్ దాడి చేశాడు.