AP: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నేలపాడులో వివిధ నిర్మాణాలను పరిశీలించిన ఆయన నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని చేయకపోతే వెళ్లిపోవాలని కాంట్రాక్టు సంస్థలపై మండిపడ్డారు. నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను పంపించేయాలని అధికారులను ఆదేశించారు.