»8 Dead 19 Injured After Blaze At Firecracker Unit
8 dead, 19 injured:బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. 8 మంది మృతి
8 dead, 19 injured:తమిళనాడులో గల బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. కాంచీపురం జిల్లాలో గల పరిశ్రమలో పేలుడు జరిగి.. 8 మంది మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు.
8 dead, 19 injured after blaze at firecracker unit
8 dead, 19 injured:తమిళనాడులో (tamilnadu) గల బాణాసంచా ఫ్యాక్టరీలో (factory) భారీ పేలుడు సంభవించింది. కాంచీపురం (Kancheepuram) జిల్లాలో గల పరిశ్రమలో పేలుడు జరిగి.. 8 మంది మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు. సమాచారం అందడంతో ఘటనా స్థలం వద్దకు అగ్నిమాపక సిబ్బంది (fire tenders) చేరుకున్నారు. మంటలను ఆర్పివేస్తున్నారు. 19 మంది గాయపడగా.. వారిలో 11 మందిని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 8 మందిని ఇతర హాస్పిటల్స్‌కు పంపించారు.
ప్రమాదానికి (accident) గల కారణం తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు (police) చెబుతున్నారు. కాంచీపురం (Kancheepuram), కుంభకోణంలో బాణా సంచా పరిశ్రమలో తరచు పేలుడు జరుగుతుంటాయి. టపాసులు (fire cracker) నిల్వ ఉంచడం.. సరయిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలా జరిగి ఉంటాయి.