ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలకి తమిళనాడు ఎంపీ సుధ లేఖ రాశారు. ‘అతి చిన్న వయస్సులో గుకేశ్ వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు. అతనికి రూ.11.45 కోట్ల బహుమతిని ప్రకటించగా.. అందులో రూ.4.8 కోట్లు పన్ను రూపంలో కోత పడనుంది. గతంలో సచిన్ టెండుల్కర్, రవి శాస్త్రీలకు ఇచ్చినట్లు గుకేశ్‌కు కూడా పన్నులో మినహాయింపు ఇవ్వాలి.’ అని కోరారు.